సరిపోదా శనివారం మంచి కలెక్షన్లు దక్కించుకుంటుండటంతో నేడు సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ్, హీరోయిన్ ప్రియాంక మోహన్, నిర్మాత డీవీవీ దానయ్య ఈ మీట్‍లో పాల్గొన్నారు. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సక్సెస్‍తో టైర్-1 హీరోల లిస్టులోకి వచ్చేశారని అనుకుంటున్నారా అని వచ్చిన క్వశ్చన్‍కు నాని చెప్పిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ మొదలైందో తనకు తెలియదని, తనకు అది సంబంధం లేని విషయం అని నాని చెప్పారు.
Home Entertainment Saripodhaa Sanivaaram Collections: కలెక్షన్లలో ఆ మార్క్ దాటేసిన సరిపోదా శనివారం.. వసూళ్లలో నాని సినిమా...