భారీ వర్షాల దాటికి విజయవాడ నగరం అతలాకుతలమైంది. చాలా కాలనీలు వరద నీటితో మునిగిపోయాయి. ఇంద్రకీలాద్రి ఘాట్రోడ్లో కొండ చరియలు విరిగిపడటంతో ఘాట్రోడ్ను మూసివేశారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం(సెప్టెంబర్ 1) కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.