కుక్‍ను దాటి హిస్టరీ క్రియేట్ చేసిన రూట్
లంకతో రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన రూట్ టెస్టు క్రికెట్‍లో తన 34వ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా రూట్ చరిత్ర సృష్టించాడు. 33 టెస్టు సెంచరీలు చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్‍ను రూట్ వెనక్కి నెట్టాడు. అత్యధిక టెస్టు శతకాలు చేసిన ఇంగ్లిష్ ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆ జాబితాలో రూట్, కుక్ తర్వాత కెవిన్ పీటర్సన్ (23), వాలే హమోండ్ (22), కోలిన్ కోడ్రే (22) ఉన్నారు. వీరిలో రూట్ ఒక్కడే ప్రస్తుతం ఆడుతున్నాడు.