రాత్రి కావడతో ఆదివారం వచ్చి మృతదేహాన్ని వెతుకుతామని అగ్నిమాపక సిబ్బంది చెప్పి వెళ్లిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గతంలో తన ఫోన్ల్లో వేరేవాళ్లు ఇదే ప్రదేశంలో చేసిన రీల్స్‌ను చూసి.. మహమ్మద్ కైఫ్ కూడా యగ్నిశెట్టిపల్లి క్వారీకి వచ్చినట్లు బంధువులు తెలిపారు. శుభకార్యం జరిగిన ఇంట్లోనే విషాదం నెలకొందని దుఖిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని వెలికి తీసిన తరువాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తామని చెప్పారు.
Home Andhra Pradesh అనంతపురం జిల్లాలో విషాదం.. రీల్స్ చేసే సరదాలో యువకుడు.. క్వారీలో జారిపడి మృతి-a young man...