మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ‘దేవర’ (Devara). జాన్వీ కపూర్ హీరోయిన్. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. ఇప్పుడు మూడో సాంగ్ రాబోతుంది. (Devara Third Single)
‘దేవర’ నుంచి ఫస్ట్ సింగిల్ గా ‘ఫియర్ సాంగ్’, సెకండ్ సింగిల్ గా ‘చుట్టమల్లే సాంగ్’ విడుదలయ్యాయి. రెండు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. రికార్డ్ వ్యూస్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు మూడో సాంగ్ కి రంగం సిద్ధమైంది. ఈ మేరకు అనిరుధ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దేవర నుంచి థర్డ్ సింగిల్ గా దావుడి (Daavudi) అనే సాంగ్ రాబోతుందని ట్వీట్ చేశాడు. అంతేకాదు, ఈ సాంగ్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డ్యాన్స్ అదరగొట్టారని తెలిపాడు. (Devara Songs)
దేవర మూడో సాంగ్ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 6 లేదా 7 న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. నేడో రేపో మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. మూడో సాంగ్ అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ అని సమాచారం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కాలు కదిపేలా దుమ్మురేపే సాంగ్ అనిరుధ్ స్వరపరిచాడట. ఇక శేఖర్ మాస్టర్ తన కొరియోగ్రఫీతో ఈ సాంగ్ ని నెక్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడని అంటున్నారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్పులు చూడటానికి రెండు కళ్ళు సరిపోవని, థియేటర్లలో ఒక ఊపు ఊపడం ఖాయమని చెబుతున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టనుంది.