మరికొన్ని గంటల్లోనే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 షో మొదలుకానుంది.ఇక ఈ షో కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Bigg Boss Telugu Season 8 Will Naga Chaitanya And Shobhita Dhulipala Make A Shoc-TeluguStop.com

అయితే బిగ్ బాస్ ను ఆదరించే వారు ఎంతమంది ఉన్నారో, బిగ్ బాస్ షో అంటే నచ్చని వారు కూడా అంతే మంది ఉన్నారు.ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే.

గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ షో కి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.బిగ్బాస్ హౌస్లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఇప్పటికే ఎంతోమంది పేర్లు వినిపించాయి.

కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరి పేరు కూడా ఇంకా ఫైనల్ కాలేదు.

షో మొదలవుతే తప్ప ఈ హౌస్ లోకి ఎవరెవరు ఎంట్రీ ఇస్తారు అన్న విషయం పై క్లారిటీ లేదు.ఇక తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే హీరో నాగచైతన్య శోభిత( Naga Chaitanya) బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాల్సిన కర్మ నాగచైతన్యకు ఏం పట్టింది ఇదంతా ఫేక్ అంటూ కొంతమంది కొట్టి పారేస్తున్నారు.

మరి ఈవిషయంలో నిజానిజాలు తెలియాలి అంటే నాగచైతన్య కానీ శోభిత( Sobhita Dhulipala) కానీ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.మరోవైపు నాగార్జున( Nagarjuna ) ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 అంతకుమించి ఉంటుంది.ఆటలకు పాటలకు గేమ్లకు ట్రిస్టులకు లిమిట్ ఉండదు అంటూ షోపై ఉన్న అంచనాలను మరింత పెంచేశారు.దీంతో ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here