‘ఐఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాలి,’ వంటి మీమ్స్ ఎక్కువగాw వినిపిస్తుంటాయి. ఎందుకంటే యాపిల్ తయారు చేసే ఐఫోన్స్ చాలా ఖరీదైనవి. ఐఫోన్స్ మాత్రమే కాదు, వాటి రిపేర్- సర్వీస్‌లు కూడా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఈ స్మార్ట్‌ఫోన్స్‌ని చాలా భద్రంగా చూసుకోవాలి. కానీ ఒక్కోసారి ఎంత భద్రంగా చూసుకున్నా, ఐఫోన్స్ కిందపడటం జరగొచ్చు. మరీ ముఖ్యంగా చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్స్‌ని నీటిలో పడేసుకుంటారు. ఆ తర్వాత బాధపడుతుంటారు. “ఐఫోన్ నీటిలో పడితే ఏం చేయాలి?” అని ఆన్లైన్లో సెర్చ్ చేసి, బియ్యం బస్తాలో పెడుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం! ఇలా చేస్తే.. మీరు మీ ఫోన్‌కి మరింత హాని కలిగించినట్టు అవుతుందని మీకు తెలుసా?