తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు..
రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కనీసం కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో.. అన్ని శాఖల అధికారులు అలెర్ట్ అయ్యారు. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.