రాజన్న సిరిసిల్ల జిల్లా: అన్నదాతకు సాగులో తోడ్పాడే మూగజీవాలను కొలిచే పొలాల అమావాస్యను సోమవారం చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు.పూల దండలు, గజ్జెలు, కొత్త కన్నాలతో ముస్తాబు చేసిన బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు.

 The New Moon Of The Fields, Telangana, Rajanna Sircilla, Sambashiva, Vemulawada-TeluguStop.com

దేవాలయాల్లో ఎడ్లతో ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు.బసవన్నలు ఏడాది పొడవున పడిన కష్టాలపై పొలాల అమావాస్య రోజు సాంబశివుడి (Sambashiva)వద్ద గోడు వెల్లబోసు కుంటాయని రైతుల ప్రగాఢ నమ్మకం.

వేములవాడ నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన అన్నదాతలు పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించుకుని గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు.వ్యవసాయమే ఆధారంగా బ్రతుకుతున్న రైతులకు అన్నీ అనుకూలంగా సవరించి పంటలు పండాలని ప్రార్థించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here