• ముఖ్యంగా పడుకున్నప్పుడు తరచుగా దగ్గు వస్తుంది.
  • రక్తపోటు స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం లేదా హృదయ స్పందన కారణంగా మైకము అనిపిస్తుంది.

నివారణ

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ముందుగా మలబద్దకం సమస్య తగ్గిపోవాలి. దానికోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు, కాయధాన్యాలు, చిక్కుళ్ళు తినడం అలవాటు చేసుకోవాలి. అలాగే శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చూడాలి. మలం మృదువుగా ఉండటానికి కనీసం రోజుకు 1 నుంచి 2 లీటర్ల నీళ్లు తప్పక తాగాలి. 45 నిమిషాల కంటే ఎక్కువసేపు శారీరక కార్యకలాపాలు, వ్యాయామాలలో పాల్గొనడం మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటే, మల విసర్జనను సాఫీగా చేస్తుంది. మలబద్ధకం సమస్య రోజూవారీ జీవితం మీద ప్రభావం చూపిస్తే వెంటనే వైద్యుల్ని కలవండి. మలం సాఫీగా వచ్చేలా స్టూల్ సాఫెనర్లను వాళ్లు సూచిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here