మీడియా కథనాలు వాస్తవమైతే

మీడియా కథనాలలోని అంశాలు నిజమైతే, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యను లేవనెత్తుతుందని కమిషన్ పేర్కొంది. సంబంధిత అధికారులు మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించలేకపోతున్నారని, ఇది ఆందోళన కలిగించే సంఘటనగా స్పష్టమవుతుందని పేర్కొంది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ స్టేటస్‌తో సహా ఈ వ్యవహారంపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అధికారులు తీసుకున్న, ప్రతిపాదించిన చర్యలను కూడా నివేదికలో పేర్కొనాలని సూచించింది. రెండు వారాల్లోగా అధికారుల నుంచి స్పందన రావాలని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here