జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘దేవర’ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ని తాజాగా మేకర్స్ రివీల్ చేశారు. (Devara Third Single)

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. ఫస్ట్ సింగిల్ గా విడుదలైన ఫియర్ సాంగ్, సెకండ్ సింగిల్ గా విడుదలైన చుట్టమల్లే సాంగ్.. రెండూ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్ కి ముహూర్తం ఖరారైంది. ‘దావుడి’ (Daavudi) అంటూ సాగే ఈ మూడో సాంగ్ ని సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో ఎన్టీఆర్, జాన్వీ జోడి అదిరిపోయింది. అంతేకాదు వీడియో సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపి సర్ ప్రైజ్ చేశారు. (Devara Songs)

దేవర థర్డ్ సింగిల్ అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ అని సమాచారం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కాలు కదిపేలా దుమ్మురేపే సాంగ్ ని అనిరుధ్ స్వరపరిచాడట. ఇక శేఖర్ మాస్టర్ తన కొరియోగ్రఫీతో ఈ సాంగ్ ని నెక్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడని అంటున్నారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్పులు చూడటానికి రెండు కళ్ళు సరిపోవని, ఈ సాంగ్ ఒక ఊపు ఊపడం ఖాయమని చెబుతున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టనుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here