నందమూరి నటసింహం బాలకృష్ణ(balakrishna)సినీరంగంలో అడుగుపెట్టి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ ఆద్వర్యంలో బాలయ్య  అర్ధ శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆద్యంతం ఎంతో కన్నుల పండుగగా జరగగా చిత్ర పరిశ్రమకి చెందిన అతిరధ మహారధులందరు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య గురించి మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)చెప్పిన మాటలు నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహాన్నినింపుతున్నాయి.   

బాలయ్య బాబు యాభై సంవత్సరాల వేడుకలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాలయ్యకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమకి జరుగుతున్న ఒక వేడుకలా చూస్తున్నాను. మహానుభావుడు ఎన్టీఆర్(ntr)శతజయంతి ఉత్సవాల్ని జరుపుకున్న సంవత్సరంలోనే బాలయ్య  అర్ధ శతజయంతి  వేడుకలు జరగడం నిజంగా ఒక వండర్. ఇలాంటి సందర్భం ఎప్పుడో ఎవరికో రేర్ గా జరుగుతుంది. అలాగే రామారావు గారి వారసుడుగా ప్రేక్షకులని మెప్పించడం అనేది చాలా కష్టతరమైనది. అలాంటిది  తండ్రిని మించిన తనయుడుగా బాలయ్య పేరు సంపాదించాడు. అదే విధంగా రామారావు గారు చేసిన క్యారక్టర్లతో పాటు,చెయ్యని  క్యారెక్టర్లు కూడా బాలయ్య చేసాడు. అవే ఫ్యాక్షనిజంతో కూడుకున్న క్యారెక్టర్స్ అని చెప్పిన చిరు ఎలాంటి భేషజాలకు పోకుండా  నేను ఇంద్ర సినిమా చేయడానికి ఆదర్శం సమరసింహా రెడ్డి మూవీ అని చెప్పుకొచ్చిన చిరు ఇంత వరకు ఎవరికి తెలియని సరికొత్త విషయాలని బయటపెట్టాడు. 

నేను ఇంద్రసేనా రెడ్డి పాత్ర చెయ్యడానికి కొంచం జంకాను. ఎందుకంటే బాలయ్య ఫ్యాక్షన్ పాత్రలకి పెట్టింది పేరు. అందుకే ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని  భయపడ్డానని చెప్పుకొచ్చాడు. అలాగే  ఇంద్రసేనా రెడ్డి, సమరసింహా రెడ్డి పాత్రలు  కలిసేలా  బాలయ్యతో  ఒక ఫ్యాక్షన్  సినిమా చేయాలనే కోరిక ఉందంటూ కథలు తయారు చేసుకోమని రచయితలకి సవాలు కూడా విసిరాడు.ఇక మా విషయంలో  ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. కానీ వాళ్లకి తెలియనది ఏంటంటే  బాలయ్య, నేను ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాం. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా  జరగదు.అందరం కలిసి డ్యాన్స్ లు కూడా చేస్తాం. కాబట్టి అభిమానులు కలిసి ఉండాలనే సూచనని చేసాడు.  అలాగే  యాభై సంవత్సరాల తర్వాత కూడా  హీరోగా నటిస్తున్న  ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు బాలయ్యకు ఇదే ఎనర్జీ  ఇస్తు  వంద ఏళ్లు బావుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ, వైద్య రంగాలలలో కూడా సేవ చేస్తున్నాడు. లాంగ్ లివ్ బాలయ్య అంటు ముగించాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here