ఎంత సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. హీరోగా ఎంట్రీ ఇచ్చి తనని తాను ప్రూవ్ చేసుకుంటేనే స్టార్ గా ఎదుగుతాడు. అయితే తన తనయుడు మోక్షజ్ఞ మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే స్టార్ అయ్యాడంటూ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అంటున్నారు.

నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) సినీ రంగ ప్రవేశం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే, మోక్షజ్ఞ డెబ్యూ గురించి తాజాగా బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలయ్య తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ డెబ్యూ గురించి స్పందించారు. “మోక్షజ్ఞ లాంచ్ పై ఆడియన్స్ లో చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే, ఆల్రెడీ అతను స్టార్. మేము ఎంతో కష్టపడితే స్టార్స్ అయ్యాము.. కానీ మోక్షజ్ఞ మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే స్టార్ అయిపోయి కూర్చున్నాడు. మోక్షజ్ఞ లాంచ్ గురించి, సినీ కెరీర్ గురించి నాకు ఎటువంటి టెన్షన్ లేదు.” అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. 

బాలయ్య మాటలను బట్టి చూస్తుంటే.. మోక్షజ్ఞ డెబ్యూపై ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్థమవుతోంది. అదే సమయంలో ఇప్పటికే స్టార్ అయిపోయి కూర్చున్నాడని.. నందమూరి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయని చెప్పడం బట్టి చూస్తుంటే. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్లాన్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికైతే మొదటి సినిమాతోనే మోక్షజ్ఞ సంచలనాలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here