2024 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350: ఫీచర్లు
కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెట్రో లుక్‌తో కొనసాగుతోంది. కొన్ని ఆధునిక ఫీచర్లను జోడించినప్పటికీ, మోటార్ సైకిల్ దాని ట్రెడీషనల్ డిజైన్ని కొనసాగిస్తుంది. ఈ బైక్ అనలాగ్ స్పీడోమీటర్ కింద ఎల్సీడీ, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ పైలట్ ల్యాంప్స్, గేర్ పొజిషన్ ఇండికేటర్, అప్‌గ్రేడ్ చేసిన టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ని పొందుతుంది. టాప్ వేరియంట్లు ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, అడ్జెస్టెబుల్ క్లచ్, బ్రేక్ లివర్లు, ఎల్ఈడీ ఇండికేటర్స్ వంటి అదనపు ప్రామాణిక ఫీచర్లను అందిస్తాయి.