తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. చాలా చోట్ల వరదలు విలయం సృష్టించాయి. చాలా మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరద సహాయక చర్యలకు ఆర్థిక సాయం చేసేందుకు సినీ సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్, సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా వరద సాయం కోసం తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు.
Home Entertainment Balakrishna Donation: వరద విలయం: తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ భారీ విరాళం.. సిద్ధు జొన్నలగడ్డ కూడా..