జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో నిర్మాత నాగవంశీకి మంచి అనుబంధం ఉంది. పైగా ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ‘దేవర’ (Devara) సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని ఆయనే సొంతం చేసుకున్నాడు. దీంతో ఎప్పటికప్పుడు దేవర మూవీ అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు కిక్ ఇస్తున్నాడు వంశీ. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. (Devara Songs)

‘దేవర’ ఫస్ట్ సింగిల్ విడుదల కావడానికి ముందు ఆ సాంగ్ అదిరిపోతుందంటూ నాగవంశీ ట్వీట్ చేశాడు. ఆయన చెప్పినట్టుగానే ఫస్ట్ సింగిల్ ‘ఫియర్ సాంగ్’ అభిమానులకు ఎంతగానో నచ్చింది. అలాగే సెకండ్ సింగిల్ ‘చుట్టమల్లే సాంగ్’ విడుదలకి ముందు.. ఎన్టీఆర్ అన్నలో రొమాంటిక్ యాంగిల్ చూస్తారంటూ ట్వీట్ చేశాడు. ఆ రొమాంటిక్ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు థర్డ్ సింగిల్ ‘దావుడి సాంగ్’కి ముహూర్తం ఖరారైంది. రేపు(సెప్టెంబర్ 4న) ఈ సాంగ్ విడుదల కానుంది. అంతేకాదు, డైరెక్ట్ గా వీడియో సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపి మేకర్స్ సర్ ప్రైజ్ చేశారు. (Devara Third Single)

అయితే, ఈ సాంగ్ గురించి తాజాగా నాగవంశీ కీలక అప్డేట్ ఇచ్చాడు. “రేపు ‘చికెన్ ఫ్రై’ పెడుతున్నాం. పాటలో కొంత భాగం ‘బిర్యాని’లా అనిపిస్తుంది. దానికోసం మాత్రం థియేటర్ కు తప్పనిసరిగా వెళ్లాల్సిందే…” అని ట్వీట్ చేశాడు. అంటే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేయట్లేదని.. కొన్ని స్టెప్స్ ని ఇప్పుడు రివీల్ చేసి, అసలైన స్టెప్పులను థియేటర్లలో చూపిస్తామని చెప్పకనే చెప్పేశాడు. (Daavudi From Devara)

కాగా, దేవర థర్డ్ సింగిల్ గా వస్తున్న ‘దావుడి సాంగ్’ అనేది డ్యూయెట్ డ్యాన్స్ నెంబర్. ఇందులో ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొట్టాడని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here