రెబల్ స్టార్ ప్రభాస్(prabhas)నుంచి మొన్న జూన్ 27 న వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అయిన మూవీ కల్కి 2898 ఏడి(kalki 2898 ad)అంటే దగ్గర దగ్గరగా రెండు నెలలు పైనే అవుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతి తెలుగువాడు గర్వపడేలా ఎంతో అధ్బుతంగా తెరకెక్కించగా  ఎన్నో రికార్డులని కూడా తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా ఓటిటి లో కూడా విడుదలయ్యి  ముందుకు దూసుకుపోతున్న టైం లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan)కల్కి గురించి చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

కల్కి ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై తన తండ్రి అశ్వనిదత్(Aswani Dutt)తో కలిసి స్వప్నదత్, ప్రియాంకదత్ లు అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన విషయం తెలిసిందే. లేటెస్టుగా  కల్కి నిర్మాతలకి  చరణ్ ఒక నోట్ ని పంపాడు. కల్కి చూసిన అనుభవాన్ని మర్చిపోలేం. అదొక అద్భుతం అంటూ  పుష్ప గుచ్చాలని కూడా పంపడంతో పాటు లవ్ ది లవ్ అనే క్యాప్షన్ ని కూడా ఉంచాడు. ఈ నోట్ ని  స్వప్న దత్  సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఇక సోషల్ మీడియాలో మరో చర్చ కూడా జరుగుతుంది.  కల్కి ని చరణ్  ఇప్పుడే చూసాడా లేక గతంలోనే చూసాడా అనే చర్చ జరుగుతుంది. కొంత మంది అయితే  గేమ్ చేంజర్ లో బిజీగా ఉండటం వల్ల ఇప్పుడు చూసాడేమో అని అంటున్నారు. ఏది ఏమైనా చరణ్, కల్కి ని అభినందించడం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే  అక్టోబర్ నుంచి  ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చెయ్యబోయే కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. గేమ్ చేంజర్ కి అయితే గుమ్మడి ఖాయ కొట్టాడు. డిసెంబర్ లో రిలీజ్ కాబోతుందని దిల్ రాజు ప్రకటించాడు కూడా.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here