ఏ వ్యక్తి ఎదగడానికైనా వారి ఉన్నతిలో గురువుదే ప్రత్యేక స్థానం. మంచి ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని అందించడంతో పాటు తన విద్యార్థి వ్యక్తిత్వాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు. అతనికి సరైన మార్గనిర్దేశం చేస్తాడు. గురువు పట్ల హృదయంలో దాగి ఉన్న గౌరవాన్ని, ప్రేమను వ్యక్తీకరించడానికి మనదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించారు. అప్పటి నుండి ఈ రోజును భారతదేశంలో ఉపాధ్యాయులకు గౌరవ సూచకంగా నిర్వహించుకోవడం మొదలుపెట్టాము. ఉపాధ్యాయ దినోత్సవం రోజున మీ ఉపాధ్యాయుడికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలనుకుంటే, ఈ హ్యాపీ టీచర్స్ డే 2024 సందేశాలు, కోట్స్, శుభాకాంక్షలు వినియోగించుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here