ఈ మధ్య పలు భారీ సినిమాలు మూడు గంటల నిడివితో విడుదలవుతున్నాయి. అయితే ఈ నిడివి కొన్ని సినిమాల పాలిట శాపంలా మారుతుంది. ఎక్కువ నిడివి కారణంగా ప్రేక్షకులు బోర్ గా ఫీలయ్యి పలు సినిమాలను ఫ్లాప్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘దేవర’ (Devara) మూవీ ఏకంగా 3 గంటల 10 నిమిషాల నిడివితో రానుందనే వార్త సంచలనంగా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ డ్రామా ‘దేవర’. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో కొన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే యూఎస్ బుకింగ్స్ డిస్క్రిప్షన్ లో ఈ సినిమా నిడివిని 3 గంటల 10 నిమిషాలుగా పేర్కొన్నారు. దీంతో అందరూ షాకవుతున్నారు. రెండు పార్ట్ లుగా చేసే సినిమాకి.. ఒక్కో పార్ట్ కి అంత నిడివి అవసరమా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం పెదవి విరుస్తున్నారు. అయితే దేవర నిడివి విషయంలో ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఎందుకంటే అది ఫైనల్ రన్ టైం కాదని తెలుస్తోంది.

దేవర పార్ట్-1 రన్ టైంని డైరెక్టర్ కొరటాల శివ 2 గంటల 45 నిమిషాలకు లాక్ చేశాడట. రోలింగ్ టైటిల్స్ తో కలిపి 2 గంటల 48 నిమిషాల వరకు ఉండే అవకాశముంది అంటున్నారు. దేవర లాంటి భారీ సినిమాకి ఇది కరెక్ట్ రన్ టైం అని చెప్పవచ్చు. పైగా అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, కట్టిపడేసే ఎమోషన్స్ తో పాటు.. మధ్యమధ్యలో సాంగ్స్ తో అలరిస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు కొరటాల దేవర సినిమాని మలిచాడని అంటున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here