భారీ వర్షాలు, వరదలు కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఎందరో నిరాశ్రయులు అయ్యారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు వరదలోనే ఉన్నాయి. ఈ ప్రభావం సినిమాలపై కూడా పడుతుంది. తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్స్ కి చెందిన ఒక సినిమా విడుదల వాయిదా పడింది.
సుహాస్, సంగీర్తన జంటగా సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 7న రిలీజ్ కావాల్సి ఉంది. సెప్టెంబర్ 6న ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు. అయితే సడెన్ గా ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి మేకర్స్ షాకిచ్చారు. వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సినిమాని వాయిదా వేస్తున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
‘జనక అయితే గనక’ అనేది ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మంచి కామెడీ ఫిల్మ్. ఈ సినిమా పట్ల దిల్ రాజు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. అందుకే ఇలాంటి టైంలో సినిమాని రిలీజ్ చేసి, తక్కువ మందికి రీచ్ అయ్యే కంటే.. కరెక్ట్ టైంలో రిలీజ్ చేసి, అందరికీ రీచ్ అయ్యేలా చేయడం కరెక్ట్ అని దిల్ రాజు భావించాడట. ఇదే విషయాన్ని మూవీ టీంతో చర్చించి పోస్ట్ పోన్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట.