జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ (Devara). సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే టైం వచ్చింది. ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారైంది. (Devara Trailer)

‘దేవర’ నుంచి వచ్చే ఒక్కో కంటెంట్.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, మూడు సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడిక ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 10న ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం. యూట్యూబ్ లో రిలీజ్ చేయడంతో పాటు, ఎంపిక చేసిన థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించనున్నారట. 2 నిమిషాల 45 సెకన్ల నిడివితో దర్శకుడు కొరటాల శివ ట్రైలర్ ను లాక్ చేశాడట. ట్రైలర్ కట్ అదిరిపోయిందని, రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతాయని అంటున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here