ఒక దర్శకుడు తన భార్యని తీసుకొని మా ఇంటికి వచ్చే వాడు. క‌న్న తండ్రిలా చూసుకుంటానని చెప్పి  ఆ త‌ర్వాత నాతో పిల్ల‌లు కనాల‌ని ఉందని చెప్పేవాడు. ఒకప్పటి ప్రముఖ నటి  సౌమ్య(soumya) చెప్పిన ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తి వివరాలు చూద్దాం.

మలయాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జస్టిస్ హేమ కమిటీ నివేదిక తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.దీంతో అన్ని భాషల ఇండస్ట్రీలోను హేమ కమిటీ  లాంటిది ఏర్పాటు చెయ్యాలనే డిమాండ్స్ వస్తున్నాయి.పైగా పలువురు నటీమణులు మీడియా ముందుకు వచ్చి  గతంలో తాము ఎదుర్కున్న  లైంగిక వేధింపుల గురించి బ‌య‌ట‌పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మలయాళ సినీ నటులపై కేసులూ కూడా నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే  సౌమ్య  మాట్లాడుతు త‌మిళ సినీ  ప‌రిశ్ర‌మ‌లోను  మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు  జరిగాయని చెప్పటం తీవ్ర దుమారాన్ని రేపుతుంది.కాలేజీలో ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న‌ప్పుడు పద్దెనిమిదేళ్ల వయసులోనే  తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ మా తల్లిదండ్రులకు సినిమా గురించి పెద్దగా అవ‌గాహ‌న లేదు.అయితే ఆ చిత్ర దర్శకుడు మా వారిని ఒప్పించి సినిమా రంగంలోకి తీసుకెళ్లాడు.షూటింగ్ కోస‌మ‌ని తరచుగా  త‌న ఇంటికి తీసుకెళ్లే వాడు.  కానీ ఆ ద‌ర్శ‌కుడు  మాట్లాడిన ప్రతిసారి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది.ఒకరోజు  ఇంట్లో తన భార్య లేనప్పుడు నాకు ముద్దు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా నేను షాక్‌కు గుర‌య్యాను. నేనేమైనా తప్పు చేశానా అనే భావ‌న నాలో క‌లిగింది. కానీ నన్ను తన కూతురిగా భావిస్తున్నానని చెబుతూనే నాతో అసభ్యక‌రంగా ప్ర‌వ‌ర్తించేవాడు. 

బలవంతంగా న‌న్ను శారీర‌కంగా హింసించేవాడు. క‌న్న కూతురిలా చూసుకుంటా అంటూనే నాతో పిల్ల‌ల్ని క‌నాల‌ని ఉంద‌నేవాడు. నాపై లెక్క‌లేనన్ని సార్లు లైంగిక దాడులు చేసాడు. సుమారు సంవ‌త్స‌రం పాటు న‌న్ను ఓ శృంగార బానిసలా చూశాడు. ఈ విషయాన్ని నా ఫ్రెండ్స్‌తో చెప్ప‌డానికి కూడా నాకు చాలా భయమేసేది.ఒక రకంగా  ఆ దర్శకుడు నా కెరీర్ ను పూర్తిగా నాశనం చేశాడు. సినిమా అయిపోయే వ‌రకు నన్ను ఒక  శృంగార బొమ్మగానే చూసాడంటూ చెప్పుకొచ్చింది. కేర‌ళ ప్ర‌భుత్వం ఇటీవ‌లే ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక‌ పోలీసు బృందానికి ఆ ద‌ర్శ‌కుని గురించి పూర్తివివ‌రాలు చెబుతాన‌ని న‌టి సౌమ్య అన్నారు. దీంతో ఆ డైరెక్టర్ ఎవరనే చర్చ అందరిలో మొదలయ్యింది. అదే టైంలో సౌమ్య నటించిన సినిమాల లిస్ట్ గురించి కూడా ఆరా తీస్తున్నారు. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here