వినాయకుడి విశిష్టత 

గణాధ్యక్షా, విఘ్నరాజా, సుప్రదీపా, మహాబలా, మంగళస్వరా, ప్రథమా, ప్రమథా, విశ్వ నేత్రా, ఆశ్రితవత్సలా, భవాత్మజాయా, అగ్రగణ్యాయా, సర్వాయా, సర్వసిద్ధిప్రదాయా, గణాధీశాయా, అభీష్టవర దాయా అంటూ అర్చిస్తుంది భక్త ప్రపంచం. జగదాధారునిగా, అపరాజితునిగా, కాంతిమతిగా, ధృతిమతిగా శ్లాఘిస్తుంది. నిఖిలావనికీ ప్రేమపాత్రుడైన ఆయనను వేదాలు, ఉపనిషత్తులకు తోడు అనేకానేక ప్రబంధాలు, శతకాలు ఎంతగా స్తుతించాయో చెప్పనలవి కాదు. ‘ఆదరమొప్ప మ్రొక్కిడుదు- నద్రి సుతా.. సమద మూషిక సాదికి సుప్రసాదికిన్’ అంటూ మహాద్భుతవర్ణన సాగించింది సహజకవి మది. ఈ విధంగా పలుకు పలుకునా తేనెలందుకున్న వినాయక స్వామి అందరివాడు, సాటిలేని మేటి రేడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here