రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట( Ellantakunta ) మండలంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం నందు ఈరోజు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ఐరెడ్డి చైతన్య రెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

 Ellanthakunta Mandal New Agricultural Market Governing Body Meeting ,ellanthakun-TeluguStop.com

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana State Govt ), GO.NO.625 తేది 19.08.2024 ద్వారా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గమును ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, స్థానిక శాసన సభ్యులు అందరికి, నూతనంగా కొలువు దీరిన పాలక వర్గం కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ సందర్బంగా ఛైర్మెన్ మాట్లాడుతూ రాబోయే రోజూల్లో రైతులు పండించే వరితో పాటు ఇతర పంటలైన మొక్కజొన్న, కందులు, పెసర మరియు పొద్దుతిరుగుడు వంటి పంటలను పండిస్తున్న రైతులకు ( farmers )కొనుగోలుకేంద్రాలు అందుబాటులో లేకపోవడం వలన పండించిన దాన్యాన్ని దూర ప్రాంతాలకు అమ్మడం కోసం తరలించడం కష్ట మవుతుందని, రైతులకు ఎలాంటి కష్టం రావద్దనే ఉద్దేశ్యంతో మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయుటకు నూతన పాలక వర్గం కృషి చేస్తుందని చెప్పడం జరిగింది.ఈ సమావేశంలో చైర్మన్,పాలక వర్గ సభ్యులు,జిల్లా మార్కెటింగ్ అధికారి, అగ్రికల్చర్ అధికారి,స్పెషల్ ఆఫీసర్, ట్రేడర్స్ పాల్గొన్నారు

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here