సెప్టెంబర్ 27 కి ముహూర్తం దగ్గర పడే కొద్దీ ఎన్టీఆర్ అభిమానుల్లో,ప్రేక్షకుల్లో  దేవర(devara)ఫీవర్ ఏ రోజుకా రోజు పెరిగిపోతుంది. చాలా ఏరియాల్లో మిడ్ నైట్ షోస్ కూడా పడబోతున్నాయి.వాటికి సంబంధించిన టికెట్స్ కూడా ఇప్పటికే  అయిపోయాయనే టాక్ కూడా వినపడుతుంది. తాజాగా  దేవర ముంగిట ఒక అరుదైన రికార్డు వచ్చి చేరింది.


 ఒవర్సీస్  అడ్వాన్స్‌ బుకింగ్ విషయంలో  దేవర పెద్ద ప్రకంపనలనే సృష్టిస్తుంది. ఫస్ట్ డే కి సంబంధించి ఒన్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి రిలీజ్ కి రెండు వారాలు ముందే భారీ స్థాయిలో  అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ జోష్ ఇలానే ఉంటే  రిలీజ్ నాటికే దేవర అడ్వాన్సు బుకింగ్స్ 3 మిలియన్ దాటవచ్చని ట్రేడ్ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి.ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి(chiranjeevi)చరణ్(ram charan)ల కాంబో లో  బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చిన  ఆచార్య నార్త్ అమెరికాలో ఫుల్ రన్  985K డాలర్స్ దగ్గర ఆగిపోయింది. 

ఇక  ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్,సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అలాగే మూడు సాంగ్స్ కూడా ఒక లెవల్లో ప్రభంజనం సృష్టించడమే కాకుండా రికార్డు వ్యూస్ ని సాధిస్తున్నాయి. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా  బాలీవుడ్ స్టార్ న‌టుడు సైఫ్ అలీఖాన్ విల‌న్‌ పాత్రలో కనిపించనున్నాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here