నెలల తరబడి ఊహాగానాలు, లీక్స్ అనంతరం యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయ్యింది. గ్లోటైమ్ 2024 ఈవెంట్లో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్స్తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4, మరెన్నో అప్‌గ్రేడ్స్, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అప్డేట్స్ బయటకు వచ్చాయి. గత ఏడాది మాదిరిగానే కొత్త తరం ఐఫోన్లలో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడళ్లు ఉన్నాయి. కానీ కొత్త విషయం ఏమిటంటే.. యాపిల్ ఏ 18 సిరీస్‌తో కొత్త చిప్‌సెట్‌ను ఇంటిగ్రేట్ చేసింది. కొత్త “కెమెరా కంట్రోల్ బటన్”ని ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి యాడ్ చేసింది. ఈ నేపథ్యంలో యాపిల్ గ్లోటైమ్ ఈవెంట్ హైలైట్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..