నేటి రాత్రికి 49 నుంచి 51.20 అడుగుల వరకు గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదుల వద్ద ప్రవాహం అధికంగా ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో హెచ్చరించారు. జలాశయాలు, చెరువులు, వాగుల వద్దకు సెల్ఫీలు దిగడానికి, చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళకూడదని విజ్ఞప్తి చేశారు. వరద నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్లను దాటడానికి ప్రయత్నించి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here