ప్రముఖ బుల్లితెర నటుడు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ ( Manas ) త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మ ముడి( Bramhamudi ) సీరియల్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు.

 Bigg Boss Contestant Manas Wife Sreeja Blessed Baby Boy, Manas, Sreeja, Baby Sho-TeluguStop.com

ఈ సీరియల్ లో మానస్ రాజ్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఇకపోతే నవంబర్లో శ్రీజ ( Sreeja ) అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే వీరి వివాహం జరిగి ఏడాది కూడా కాకుండా వీరిద్దరూ త్వరలోనే తల్లితండ్రులు కాబోతున్నారు.గత కొద్ది రోజుల క్రితం శ్రీజ సీమంతపు వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.అయితే తాజాగా మరోసారి ఈమె సీమంతపు ఫోటోలను మానస సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన ఈయన ఆనందం,ప్రేమతో నిండిన హృదయాలతో మేం త్వరలోనే అమ్మానాన్నలు కాబోతున్నాం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఇలా త్వరలోనే మానస్ తండ్రిగా ప్రమోట్ కాబోతున్నారని విషయం తెలిసిన అభిమానులు ముందుగానే ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక ఈ సీమంతపు ఫోటోలను షేర్ చేసిన కొంత సమయానికి ఈయన మరో శుభవార్త తెలిపారు.తన భార్య మగ బిడ్డకు జన్మనిచ్చింది అంటూ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు ఈ క్రమంలోనే బ్లెస్స్డ్ బేబీ బాయ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టును షేర్ చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా మానస్( Manas ) తండ్రి కావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అయితే మానస్ తన కొడుకు ఫోటోలను మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here