రాజన్న సిరిసిల్ల జిల్లా:రోడ్డు ప్రమాద బాధితులకు గడువులోగా సాయం అందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా( Collector Sandeep Kumar Jha ) ఆదేశించారు.హిట్ అండ్ రన్ అంశంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ), ఆయా శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించారు.

 Road Accident Victims Should Get Help Within The Time Limit, Road Accident , Vic-TeluguStop.com

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాద బాధితులు, వారి కుటుంబ సభ్యులకు నిర్ణయించిన గడువులోగా రెవెన్యూ, పోలీస్ అధికారుల నివేదిక ప్రకారం పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.

రెండు లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.రెవెన్యూ, పోలీస్ అధికారులు కోర్టు గైడ్లైన్స్ ప్రకారం కేసుల విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు.

సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేష్, రాజేశ్వర్, డీఎం హెచ్ఓ వసంత రావు, డీటీఓ లక్ష్మణ్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఘన్ శ్యామ్ ఓజా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here