పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై వరుసగా సినిమాలని నిర్మిస్తూ ప్రేక్షకుల్లో తన కంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న ప్రొడ్యూసర్ టి జి విశ్వ ప్రసాద్(tg vishwa prasad)పవన్ కళ్యాణ్(pawan kalyan)తో బ్రో ని కూడా నిర్మించాడు. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ తో పరాజయాన్ని అందుకున్నా కూడా ప్రభాస్(prabhas)తో చేస్తున్న రాజా సాబ్(raja saab)తో సరికొత్త రికార్డులు సృష్టిస్తామని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో  చెప్పుకొచ్చాడు.

ఇటీవల ప్యారిస్ లో ఒలింపిక్స్ క్రీడలతో పాటు పారా ఒలింపిక్స్ క్రీడలు కూడా  జరిగిన విషయం  తెలిసిందే.అందుకు సంబంధించి  పారా ఒలింపిక్స్(paralympics)లో మన దేశం నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారు పతకాలు గెలిచి దేశ ప్రతిష్ట పెరగడం కూడా జరిగింది. అయితే యునైటెడ్ స్టేట్స్‌లో బ్లైండ్ క్రికెట్‌(blind criket)ను ప్రోత్సహించే ప్రయత్నంలో, నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్  రీసెంట్ గా  సియాటిల్‌లో ఇండియా నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్, సీయాటిల్ థండర్‌బోల్ట్స్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది.దీనికి ముఖ్య అతిథిగా టీజీ విశ్వప్రసాద్ హాజరయ్యి రాబోయే రోజుల్లో  పారా ఒలింపిక్స్‌లో అంధుల క్రికెట్‌ను చేర్చేందుకు అన్ని విధాలా కృషి చేయాలని నిర్మాత విశ్వప్రసాద్‌ పేర్కొన్నారు.

సియాటిల్‌లో ఆతిథ్యం ఇచ్చినందుకు విశ్వ ప్రసాద్‌కు అంధుల క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మహంతేష్ కృతజ్ఞతలు తెలిపారు. థండర్ బోల్ట్స్ అధినేత ఫణి చిట్నేని మాట్లాడుతూ క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదని, భారతీయులకు భావోద్వేగమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకాష్ గుప్తా, వాషింగ్టన్ సెనేటర్ డెరిక్, హౌస్ రిప్రజెంటేటివ్ వందన స్లేటర్ తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here