తనని ఎందుకు యంగ్ టైగర్ అని అంటారో దేవర ట్రైలర్ తో ఎన్టీఆర్ మరోసారి నిరూపించాడు.ట్రైలర్ అయితే మాములుగా లేదు. ఒక రేంజ్ లో ఉంది. అసలు ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రైలర్ రాలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక పవర్ ఫుల్ మాస్ సినిమాకి సంబంధించి ఏ ఏ అంశాలు ఉండాలో అవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు.ఈ సారి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తున్నామంటు   ఘంటా పదంగా చెప్తున్నారు. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో చూద్దాం.

దేవర ట్రైలర్ తో ఎప్పటినుంచో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో ఉన్న ఒక డౌట్ కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అదేంటంటే దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ విషయం.ట్రైలర్ లో చాలా  క్లియర్ గా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అని, పైగా తండ్రి కొడుకులనే విషయం అర్ధమవుతుంది. నిజానికి మూవీ షూటింగ్ ప్రారంభం అయిన దగ్గరనుంచే ఈ చర్చ మొదలయ్యింది. దాంతో ఫ్యాన్స్ అందరు ఒక్కసారిగా ఎన్టీఆర్ గతంలో తండ్రి కొడుకులుగా చేసిన ఆంధ్రావాలా, శక్తీ సినిమాలని గుర్తుకు తెచ్చుకోవడం స్టార్ట్ చేసారు. 

కానీ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక వాళ్ళలో ఉన్న భయం పటాపంచలు అయ్యింది.

 ఈ సారి ఆంద్రావాలా, శక్తీ  సెంటిమెంట్ పని చెయ్యదని  తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ విజృంభణ ఖాయమని అంటున్నారు.అంతే కాకుండా సినిమా పక్కా హిట్ అంటు ఎంత  కలెక్షన్స్ సాధిస్తుందో అని అంచనా వేస్తున్నారు. ట్రైలర్ అయితే రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే రికార్డు వ్యూస్ ని సాధిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here