BSC Nursing Course : బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశానికి విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో రెండు/నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఈఏపీసెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు హెల్త్ యూనివర్సిటీ వెబ్ సైట్ లో ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులకు రూ.2,360, బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.1,888 నిర్ణయించారు. అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే 89787 80501, 79977 10168, దరఖాస్తు సమయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తే 9000780707 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.
Home Andhra Pradesh బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా ప్రవేశాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి-ntr health university bsc nursing...