ఎవరైనా చెబితేనే అలా చేస్తారా, ఈ అన్యాయాన్ని చూడకూడదనుకునే వాళ్లు టీడీపీ కార్యాలయం దగ్గరకు వెళ్లి ధర్నా చేస్తే, ధర్నాకు వెళ్లిన వారిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఆ సమయంలో కొద్దో గొప్పో రా‌ళ్లు పడి ఉంటాయని జగన్ అన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న తాను చంద్రబాబు మీద కక్ష సాధింపుతో వ్యవహరించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పాల్గొన్న వారందరిని గుర్తించామన్నారు. నిందితుల సెల్‌ఫోన్లు, సీసీ కెమెరాలు చూసి వారందర్నీ 41ఏ నోటీసులు ఇచ్చి, కోర్టులో ప్రవేశపెట్టినట్టు జగన్ చెప్పారు. ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులు కావడంతో 41ఏ ఇచ్చి కోర్టులో హాజరు పరిచామని, తాము నిబద్ధతతో అడుగులు వేశామని, ఈ కేసులో నిందితులపై అప్పట్లోనే చర్యలు తీసుకున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here