పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్‌మెంట్(పీఎం ఈ-డ్రైవ్) పథకం కింద 88,500 ప్రాంతాల్లో ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం 100 శాతం సహాయం అందించనున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ అంబులెన్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులకు రూ.3,679 కోట్ల సబ్సిడీని అందించారు. 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, 14,028 ఎలక్ట్రిక్ బస్సులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here