ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 12 Sep 202401:49 PM IST
- ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ తేలికపాటి వర్ష సూచన ఇచ్చింది. మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తర, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Thu, 12 Sep 202410:21 AM IST
- Visakhapatnam : ఇండియన్ రైల్వే.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ అందించింది. విశాఖపట్నానికి మరొక వందేభారత్ రైలు రానుంది. ఇది విశాఖపట్నం- దుర్గ్ మధ్య నడవనుంది. ఈ రైలు 5 స్టేషన్లలో ఆగనుంది.
Thu, 12 Sep 202409:45 AM IST
- Tirupati Accident : తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఓ కంటైనర్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
Thu, 12 Sep 202408:54 AM IST
- YSRCP : 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. జగన్ ఎంతో ప్రాధాన్యమిచ్చిన కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఆళ్ల నాని, మోపిదేవి వంటి వారు పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే మరో కీలక నేత పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది.
Thu, 12 Sep 202408:46 AM IST
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గడువును మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.
Thu, 12 Sep 202408:31 AM IST
- PG Medical Admissions: పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల అవకాశాలను దెబ్బతీసేలా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 85 ఉందని వైద్య విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇన్‌సర్వీస్ కోటాలో పీజీ వైద్యలో రిజర్వేషన్లను కుదించడంపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది.
Thu, 12 Sep 202408:06 AM IST
- Varanasi Suicides: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గత ఏప్రిల్ అదృశ్యమైన అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏలూరు చెందిన సోదరులు స్తిరాస్థి వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో గత ఏప్రిల్‌లో ఊరు విడిచి వెళ్లిపోయారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో బెదిరింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు.
Thu, 12 Sep 202404:52 AM IST
- Vizianagaram : విజయనగరం జిల్లాలో ప్రమాదం జరిగింది. మంత్రి ఎస్కార్ట్ వాహనానికి జరిగిన ప్రమాదంలో.. ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మంత్రి సంధ్యారాణికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Thu, 12 Sep 202404:28 AM IST
-
Vizianagaram Tragedy: విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. డ్వాక్రా రుణం తీసుకుని భార్య భర్తలు ఇంటికి వెళ్తున్నారు. ఇంతలోనే భార్య కళ్లెదుటే వరద నీటిలో భర్త కొట్టుకుపోయాడు. దీంతో ఆ భార్య భర్తని కాపాడండి అంటూ కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
Thu, 12 Sep 202404:23 AM IST
- SwiggyBoy Ganja Delivery: డబ్బు సంపాదన కోసం స్విగ్గీ డెలివరీ రూపంలో ఇంటి వద్దకే గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న యువకుడిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి తిరుపతిలో విక్రయిస్తున్నట్టు గుర్తించారు.
Thu, 12 Sep 202403:43 AM IST
- Vizianagaram : విజయనగరం జిల్లాలో విషాదం జరిగింది. భార్య కళ్లెదుటే వరద నీటిలో భర్త కొట్టుకుపోయాడు. దీంతో తన భర్తని కాపాడాలని ఆ కేకలు వేసింది. అయిన ప్రయోజనం లేదు. ఆమె ముందే భర్త వరద నీటిలో కొట్టుకుపోయాడు. అతని కోసం గాలిస్తున్నారు.
Thu, 12 Sep 202403:23 AM IST
- TTD Seva male quota: టీటీడీ శ్రీవారి సేవకుల మగవారి కోటా గురువారం విడుదల కానున్నాయి. దీంతో పాటు స్థానికులకు అంగ ప్రదక్షిణం సేవా టిక్కెట్ల కోసం రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభం కానుంది. శ్రీవారి మెట్టు నెంబర్ 1,200 వద్ద తప్పనిసరిగా స్కానింగ్ తప్పనిసరి చేశారు.
Thu, 12 Sep 202402:06 AM IST
- IAS Vs IPS: విజయవాడ బుడమేరు వరద సహాయక చర్యల్ని పర్యవేక్షించేందుకు వెళ్లిన సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్‌ను ఎస్సై అడ్డుకోవడంపై విచారణ కొనసాగుతోంది.పోలీసులు ఉద్దేశపూర్వకంగా తనను అడ్డుకున్నారని ఐఏఎస్ అధికారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వివాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి ప్రభుత్వానికి నివేదిస్తారు.
Thu, 12 Sep 202401:25 AM IST
- MBBS Merit List: ఏపీలో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్న మెరిట్ లిస్ట్‌ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో ఏపీలోని ఏయూ, ఎస్వీ యూనివర్శిటీల పరిధిలో ప్రభుత్వ ,ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెరిట్ లిస్ట్ ఖరారు చేశారు.