అరెకపూడి గాంధీ ఇంటికి వచ్చి బీఆర్​ఎస్​ కండువా కప్పుతా అని కౌశిక్​ రెడ్డి సవాల్​ చేశారు. ఈ సవాల్​ను స్వీకరించిన అరెకపూడి గాంధీ.. కౌశిక్ రెడ్డి రాకపోతే తానే కౌశిక్ ఇంటికి వస్తా అంటూ ప్రతి సవాల్​ చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కొండాపూర్​లోని కౌశిక్​ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఈ ఇద్దరు నేతల అనుచరులు పరస్పరం దాడులు చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here