నల్లగొండ జిల్లా: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని,ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు,డీజేలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారని,ఎస్పీ ఆదేశాల మేరకు డీజే నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయక మండపల వద్ద గాని,ఊరేగింపులకు గాని డీజేలు ఏర్పాటు చేయకూడదని నాగార్జున సాగర్,హాలియా సర్కిల్ ఇన్స్పెక్టర్స్ బీసన్న, జనార్దన్ గౌడ్ తెలిపారు.

 No Dj Permits For Ganesh Utsavs-TeluguStop.com

శుక్రవారం వారు మాట్లాడుతూ గణేష్ విగ్రహాల వద్ద నిర్వాహకులు స్పీకర్లను తక్కువ సౌండ్ తో రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, ఎవరైనా నిర్వాహకులు లౌడ్ స్పీకర్లు,డీజే సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

అదే విధంగా పాఠశాలలు, కళాశాలలు,ఆస్పత్రులు,ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలకు,ఇతర ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగేలా చేయరాదన్నారు.అదేవిధంగా వినాయక నిమజ్జన శోభయాత్రకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ నిఘాతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here