రాజన్న సిరిసిల్ల జిల్లా :చర్చ్ ఫాదర్ పై హత్యప్రయత్నం కేసులో 18 మందికి ఒక్కొక్కరికి 10,000/- రూపాయల జరిమానా విధిస్తూ వేములవాడ సబ్ జడ్జి రాధికా జైశ్వాల్ శుక్రవారం తీర్పు వెల్లడించారని వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.వివరాల మేరకు వేములవాడ పట్టణ పరిధిలోని చర్చ్ నందు ఫాదర్ గా పని చేయుచున్న బ్రదర్ సువర్ణ పాల్ పై అదే చర్చ్ నందు ఫాదర్ పని చేసి తొలగించబడిన తిమేతి అనే వ్యక్తి తనను తీసివేయడానికి కారణం అని అతనిని చర్చ్ నుండి ఎలాగైనా కాళీ చేపించాలని 2015 సంవత్సరం లో అక్రమంగా తన అనుచరులు 17 మందితో కలసి చర్చ్ లోకి ప్రవేశించి బ్రదర్ సువర్ణపాల్ పై హత్యప్రయత్నం చేయగా సువర్ణ పాల్ పిర్యాదు మేరకు

 18 People Fined Rs 10,000/- Each In The Case Of Attempted Murder Of A Church Fat-TeluguStop.com

అప్పటి ఎస్.

ఐ లక్ష్మయ్య కేసు నమోదు చేయగా ఇన్స్పెక్టర్ వెంకటేష్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు .సి ఎం ఎస్ ఎస్.ఐ రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ సురేష్ ,సి ఎం ఎస్ కానిస్టేబుల్ మధుసూదన్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.ప్రాసిక్యూషన్ తరపున ఆడిషన్ పిపి గడ్డం లక్ష్మణ్ వాదించగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి రాధికా జైశ్వాల్ నిందుతులకు ఒక్కకరికి 10,000/- రూపాయల జరిమానా విదించినట్లు వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here