మూవీ: నునాక్కుజి 

నటీనటులు: బసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోని, సిద్దిఖి తదితరులు

రచన: కె.ఆర్ కృష్ణ కుమార్

ఎడిటింగ్: వి‌.ఎస్ వినాయక్

సినిమాటోగ్రఫీ: సతీష్ కురుప్

మ్యూజిక్: విష్ణు శ్యామ్

నిర్మాతలు: సరీగమ

దర్శకత్వం: జీతు జోసెఫ్

ఓటీటీ: జీ5

కథ:

కేరళలోని ఊరిలో హ్యాపీగా లైఫ్ ని లీడ్  చేస్తోన్న ఓ జంట. ఎజీ పుజికున్నెల్(బసిల్ జోసెఫ్), రష్మిత(గ్రేస్ ఆంటోని) ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు‌. అయితే అనుకోకుండా వారి లైఫ్ లో ఓ ప్రాబ్లమ్ వస్తుంది. వారి పర్సనల్ వీడీయో ఒకటి తమ ల్యాప్ టాప్ లో ఉంటుంది. దానిని ఇన్ కమ్ టాక్స్ అధికారులు తీసుకెళ్తారు. ఇక ఆ వీడియో కోసం ల్యాప్ టాప్ ని తిరిగి తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో వారు కొన్ని అబద్దాలు చెప్తారు. వాటివల్ల వారికెదురైన సమస్యలేంటి? ఇంతకి ఆ పర్సనల్ వీడియో బయటకు లీక్ అయ్యిందా ? ల్యాప్ టాప్ ని తిరిగి తీసుకున్నారా లేదా అనేది మిగతా కథ. 


విశ్లేషణ:

దృశ్యం, నెరు, 12th మ్యాన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన దర్శకుడు ‘జీతు జోసెఫ్’.. అతని దర్శకత్వంలో వచ్చిన మూవీనే నునాక్కుజి.  స్క్రీన్‌ప్లే, కథ ప్రెజెంటేషన్ లో అతని మార్క్ ఇందులో కన్పిస్తుంది. కాకపోతే ఇది సీరియస్ కాన్సెప్ట్ ని కామెడీతో ముడిపట్టేశాడు. తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయ్యింది. 

కామెడీ బాగున్నప్పటికి స్టోరీలో ఒకటో రెండో ట్విస్ట్ లు ఉండాలి. థ్రిల్ ను పంచే విధమైన ఇంటర్వెల్ సీన్ , క్లైమాక్స్ సీన్ మెసెజ్ ఇస్తూనే ఏదో హ్యాపీ ఎండింగ్ ఉంటేనే ఆడియన్స్ ఆ సినిమాకి కనెక్ట్ అవుతారు. ఇది సినిమాకి కాస్త మైనస్. అయితే బసిల్ జోసెఫ్ నటన, కామెడీ టైమింగ్ సినిమాకి చివరి వరకు చూసేలా చేస్తాయి. 

సెకెంఢాఫ్ లో పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. భార్యాభర్తల ప్రైవేట్ వీడియో ఒకటి ఇతరుల చేతుల్లోకి వెళితే దానిని కాపాడుకోవడానికి వారు చేసేవన్నీ నవ్వు తెప్పిస్తాయి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు . అడల్ట్ కంటెంట్ ఏం లేదు.  సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ బాగుంది. వి.ఎస్ వినాయక్ ఎడిటింగ్ నీట్ ఉంది. విష్ణు శ్యామ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

ఎజీ పుజికున్నెల్ పాత్రలో బసిల్ జోసెఫ్ నట విశ్వరూపం చూడొచ్చు. సినిమా మొత్తం స్మైల్ తో ప్రాపర్ కామెడీ టైమింగ్ తో చివరివరకు చూసేలా ఉంటుంది‌. రష్మిత రంజిత్ గా గ్రేస్ ఆంటోనీ, నిఖిలా విమల్, సిద్దీఖి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

ఫైనల్ గా : ట్విస్ట్ లు పెద్దగా లేని ఈ కామెడీ ఎంటర్‌టైనర్ కొంతమందికి నచ్చేస్తుంది. 

రేటింగ్: 2.5 / 5

✍️. దాసరి  మల్లేశ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here