నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలోని బస్టాండ్ చోరీలకు అడ్డాగా మారిందని మీడియాలో వచ్చిన కథనాలకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం స్పందించారు.కాలినడకన ఆయన బస్టాండ్ మరియు వివిధ ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు.

 Arrange Cc Cameras In Miryalaguda Bus Stand Mla Battula, Cc Cameras ,miryalagud-TeluguStop.com

బస్టాండ్ ను తనిఖీ చేసి మరుగుదొడ్లు శుభ్రంగా లేవని,పరిసరాలలో లైట్స్ మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ ను ఆదేశించారు.అనంతరం పట్టణంలోని చికెన్ సెంటర్ నిర్వాహకులు వెస్టేజ్ బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో నేరుగా వెళ్లి వారి యాజమాన్యాన్ని హెచ్చరించారు.

అనంతరంకూరగాయల మార్కెట్ ను సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు.

ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించి అందరికీ సహకరించాలని కోరారు.

అనంతరం కేఆర్ ఎస్టేట్స్ లోనూ షాపులు తిరిగి ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలను పూర్తిగా నియంత్రించాలని సూచించారు.డాక్టర్స్ కాలనీలో హాస్పిటల్స్ మరియు మెడికల్ షాప్స్ ఒనర్స్ తో మాట్లాడి డాక్టర్స్ కాలనీలోని ట్రాఫిక్ ఇబ్బందులను నియంత్రించాలని,వాహన దారులు రోడ్డుపై పార్కింగ్ చేయడం ద్వారా ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ రావడానికి ఇబ్బంది అవుతుందని, అందరూ కలసికట్టుగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here