ఇటీవల ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన న్యాచురల్ స్టార్ నాని (Nani).. తన నెక్స్ట్ మూవీతో బిజీ అయ్యారు. నాని తన 32వ మూవీ HIT: The 3rd Case లో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్న యునానిమస్ ప్రొడక్షన్స్ తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే హిట్ ఆఫీసర్ గా నాని క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

‘హిట్-3’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. హీరో నాని మొదటి రోజే షూట్లో జాయిన్ అయ్యారు. ఈ మూవీలో హిట్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు నాని.  ఈ క్యారెక్టర్ కోసం నాని కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. 

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్. మే 1, 2025న వేసవిలో హిట్-3 థియేటర్లలో విడుదల కానుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here