రాజన్న సిరిసిల్ల జిల్లా: గర్భిణులు, బాలింతలు, పిల్లలు మంచి పోషకాహారం తీసుకోవాలని సిడిపిఓ సౌందర్య సూచించారు .ఎనీమియా నిర్ధారణ పరీక్షల ప్రత్యేక శిబిరాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాగా బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు దేసాయిపల్లి లో ఎనిమియా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

 Anganwadi Centers Should Be Utilized, Said Cdpo Soundarya , Cdpo Soundarya, Ang-TeluguStop.com

బోయినపల్లి వైద్యాధికారి రేణుక ఆధ్వర్యం లో గర్భిణీలకు, బాలింతలకు, ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా సిడిపిఓ సౌందర్య మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు వారి పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రతినెల పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు.రక్త శాతం తక్కువ ఉన్న వారుమందులు, పండ్లు, డ్రైఫ్రూట్ తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నిర్మల, హెల్త్ సూపర్వైజర్, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here