మూవీ : రఘుతాత

నటీనటులు: కీర్తీ సురేశ్, ఎమ్.ఎస్ భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాజీవ్ రవీంద్రనాథన్ తదితరులు

ఎడిటింగ్: టి‌. ఎస్ సురేశ్

మ్యూజిక్: సేన్ రోల్డన్

సినిమాటోగ్రఫీ: యామిని యజ్ఞమూర్తి

నిర్మాతలు: విజయ్ కిరగందూర్

రచన, దర్శకత్వం: సుమన్ కుమార్

ఓటీటీ: జీ 5 

కథ: 

మద్రాసు సెంట్రల్ బ్యాంక్ లో కయళ్ పాండియన్(కీర్తీ సురేశ్) ఉద్యోగం చేస్తూ ఉంటుంది.  కయళ్ పాండియన్ కి కథలు రాయడమంటే ఇష్టం ఉంటుంది. పెళ్ళి చేసుకోకూడదని దృడంగా నిశ్చయించుకుంటుంది. అదే సమయంలో తన తాత రఘోత్తమన్(ఎమ్.ఎస్ భాస్కర్) కి క్యాన్సర్ వ్యాధి ఉందని తెలుస్తుంది. ఇక తను చనిపోయే లోపు కయళ్ పెళ్ళి చూడాలని రఘు తాత అనుకుంటాడు.  అయితే పెళ్ళి అంటే ఇష్టం లేని కయళ్ తను ఇష్టపడిన తమిళ్ సెల్వన్( రవీంద్ర విజయ్) తో పెళ్ళికి సిద్దమవుతుంది. ఇదే సమయంలో వారిద్దరి నిశ్చితార్థం కూడా జరుగుతుంది. నిశ్చితార్థం తర్వాత తమిళ్ సెల్వన్ ప్రవర్తన తెలుసుకుంటుంది కయళ్. ఇక పెళ్ళిని క్యాన్సిల్ చేద్దామని అనుకుంటుంది కయళ్. అలా అనుకొని ఓ ప్లాన్ ఊహించిన కయళ్.. అందులో భాగంగా హిందీ పరీక్ష రాయడానికి సిద్దమవుతుంది. హిందీ పరీక్షకి కయళ్ పెళ్ళికి మధ్య సంబంధమేంటి? అసలు రఘుతాత ఏం చేశాడు? తమిళ్ సెల్వన్ గురించి కయళ్ తెలుసుకున్న నిజమేంటి తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

రెండు గంటల నిడివితో రిలీజైన ఈ కథ ఫస్టాఫ్ చూడగానే ఇక ఐపోయింది రా సినిమా అనిపించేంత ల్యాగ్ అనిపిస్తుంది. ‌కానీ అసలు కథ అరగంట తర్వాత మొదలవుతుంది. అలా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, కామెడీతో పాటు కథనం పరుగులు పెడుతుంది. మొదట రవీంద్ర విజయ్ ని కీర్తీ సురేష్ ని చూసి ఈయనేంటనే ఆమె పక్కన అనుకుంటారంతా కానీ సినిమా చూస్తుంటే ఈ రోల్ కి ఇతనే కరెక్ట్ అని తెలుస్తుంది. అంతలా ఆ పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది‌.


తమిళనాట హిందీ బాషని యాక్సెప్ట్ చేయని రోజులవి.. దాన్ని అక్కడ అక్కడా చూపిస్తూనే ఓ అమ్మాయి గురించి కాస్త లిబర్టీ తీసుకొని కథని మలిచారనే ఫీలింగ్ వస్తుంది. ఇది మలయాళం ఫ్లేవర్ గా అనిపిస్తుంది. సెకెంఢాఫ్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ఎగ్జామ్ లో కాపీ కొట్టే సీన్ , ఇంకా ఆ పెన్ను గురించి జరిగే డిస్కషన్ బాగుంటుంది‌. మొదటి సగం చూసి వదిలేస్తే ఓ మంచి కథని మిస్ అవుతారు. అడల్ట్ సీన్లు ఎక్కడా లేవు. ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా మేకర్స్ తీసారు. 

1970 బ్యాక్ డ్రాప్ ని కళ్ళకి కట్టి‌నట్టు చూపించారు. చాలా చక్కగా కుదిరింది‌. యామిని యజ్ఞమూర్తి సినిమాటోగ్రఫీ కథకి ప్లస్ అయ్యింది‌. టి.ఎస్ సురేశ్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. సేన్ రోల్డన్ సంగీతం అంతగా కుదరలేదనిపించింది. పాటలు తమిళ్ లో బాగానే ఉండొచ్చేమో కానీ తెలుగులో అంతగా వర్కవుట్ అవ్వలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:

కళయ్ గా కీర్తి సురేష్, తమిళ్ సెల్వన్ గా రవీంద్ర విజయ్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. రఘుతాతగా ఎమ్.ఎస్ భాస్కర్ ఆకట్టుకున్నారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు. 

ఫైనల్ గా : ఫ్యామిలీతో కలిసి చూసే కామెడీ ఎంటర్‌టైనర్. యావరేజ్ ఫస్టాఫ్ అండ్ ఎంగేజింగ్ సెకంఢాఫ్. 

రేటింగ్ : 2.75 / 5 

✍️. దాసరి మల్లేశ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here