‘పార్లమెంటు నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే, అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆస్పత్రులకు, సీహెచ్‌సీలకు, పీహెచ్‌సీలకు, విలేజ్‌ క్లినిక్స్‌కు మార్గదర్శిగా ఉంటుంది. సూపర్‌స్పెషాల్టీ సేవలు కూడా పేదలకు ఉచితంగా ఆ జిల్లా స్థాయిలోనే అక్కడే లభిస్తాయి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు, అక్కడి ప్రజలకు కూడా. వారికి నాణ్యమైన వైద్యం అందదు సరికదా, ప్రైవేటు ఆస్పత్రులకు పోటీ లోపించి వైద్యం కోసం వసూలుచేసే ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి. ఎప్పుడైనా ప్రైవేటుకు గవర్నమెంటు పోటీగా ఉంటేనే, రేట్లు రీజనబుల్‌గా ఉంటాయి. కాలేజీలను ప్రైవేటీకరించాలన్న మీ విధానం అందరినీ దెబ్బతీస్తుందన్న మాట వాస్తవం కాదా? అటు ప్రజలను, ఇటు పిల్లలను కోవిడ్‌ లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజారోగ్యరంగమే అని గుర్తించకపోతే ఎలా చంద్రబాబు’ అని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here