ఖుష్బూ అటు సినిమా రంగంలో ఇటు టీవీ రంగంలో పొలిటికల్ గా కూడా ఆమెకు ఎంతో మంచి పేరు ఉంది. అలాంటి ఖుష్బూతో ఒక ఛానెల్ సరదాగా జరిపిన చిట్ చాట్ లో ఆమె ఎన్నో విషయాలు చెప్పారు. 

“స్కూల్ లో నా పేరు నక్కత్ ఖాన్ .. ఐతే స్కూల్ టైం నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చేసాను అప్పుడే ఖుష్బూ అని పేరు మార్చేశారు. నేను ముస్లింని. నక్కత్ అంటే అర్ధం ఖుష్బూ అందుకే పేరు మార్చేశారు. వెంకటేష్, కమల్ సర్, చిరంజీవి, సుహాసిని అంటే ఇష్టం. రాజమౌళి అంటే మూవీని చాలా గ్రాండ్ లుక్ లో చూపించడానికి ట్రై చేస్తారు, త్రివిక్రమ్ పక్కా కమర్షియల్. పొలిటికల్ గా నేను ఎంట్రీ ఇవ్వడానికి చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు.. నా గోల్ ఏంటంటే నేను పార్లమెంట్ కి వెళ్ళాలి. జయలలిత, సీనియర్ ఎన్టీఆర్, నరేంద్ర మోడీ వీరంతా నాకు ఇన్స్పిరేషన్. 80 స్ రి-యూనియన్ లో అందరం బాగా ఎంజాయ్ చేస్తాం. మేము కొంతమందిమి కలిసి కోర్ కమిటీగా ఏర్పడడం. ఎప్పుడు ఈ ఫంక్షన్ పెట్టుకోవాలి..ఎలాంటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకోవాలి వంటివన్నీ మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. ప్రతీ ఇయర్ ఈ రీయూనియన్ జరుగుతుంది. మేమంతా బాగా అల్లరి చేస్తాం. వెంకటేష్ తో నటించిన కలియుగ పాండవులు అంటే నాకు చాలా ఇష్టం.. అదెప్పుడూ నా మనసులోంచి పోదు. సినిమా, టీవీ, రాజకీయ రంగాల్లో ఇంత సక్సెస్ కావడానికి కారణం డెడికేషన్” అంటూ ఎన్నో విషయాలు చెప్పింది ఖుష్బూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here