ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ స్పందించింది. గౌరవ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్ పేరుతో ప్రెస్ నోట్ విడుదలైంది.

“తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో సభ్యులైన కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఫిర్యాదును  తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కి ఇవ్వడం జరిగింది మరియు దానిని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్  కు సిఫార్సు చేయడం జరిగింది. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశం అయ్యి POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుంది. బాధిత పక్షం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫిర్యాదు చేసి FIR  నమోదు చేసారని మాకు తెలిసినది. బాధిత పార్టీల గోప్యతను కాపాడాలని మేము అన్ని మీడియా సంస్థలను, ప్రింట్ మీడియా/ డిజిటల్ మీడియా/ ఎలక్ట్రానిక్ మీడియాలను అభ్యర్ధిస్తున్నాము. సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం ఈ సమస్య పరిష్కరించబడే వరకు సంబంధిత వ్యక్తుల యొక్క ముసుగులు లేని ఫొటోగ్రాఫ్ లను మరియు వీడియోలను ఉపయోగించవద్దు అని మరియు ఏదైనా ఉపయోగించినట్లైతే వాటిని వెంటనే తీసివేయమని మీ అందరిని మరొకసారి అభ్యర్ధిస్తున్నాము.” అని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here