కామెడీ అండ్  క్యారక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన వ్యక్తి సుహాస్(suhas)కలర్ ఫోటో దగ్గరనుంచి వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనంతో వరుస హిట్లని అందుకున్న సుహాస్ ఇప్పుడు గొర్రె పురాణం(gorre puranam)తో హ్యాట్రిక్ ని అందుకోవడానికి సిద్దమవుతున్నాడు.

రీసెంట్ గా గొర్రె పురాణం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ అవ్వడమే కాదు ఇప్పుడు  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పూర్తిగా గొర్రె ప్రధాన పాత్రగా తెరకెక్కుతుందనే విషయం తెలియడంతో పాటుగా కొంత మంది  హిందూ,ముస్లిం ల మధ్య గొర్రె కోసం గొడవ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. సుహాస్ కూడా గొర్రె మీద ప్రేమ పెంచుకోవడంతో పాటుగా గొర్రె ని కాపాడటం కోసం ఎంత వరకైనా వెళ్తాడని తెలిసేలా  కోర్టులో కేసు కూడా వేసాడు.

 

దీంతో మూవీ మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక ఈ మూవీతో ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి మరోసారి కమ్ బ్యాక్ ఇచ్చేలా అనిపిస్తుంది. జడ్జీ క్యారక్టర్ లో  గొర్రె మీద కేసు వేసిన గొర్రె ఎవరనే డైలాగ్ ని చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది.  విషిక కోట హీరోయిన్ గా చేస్తుండగా బాబీ దర్శకత్వంలో ఫోకల్ వెంచర్స్ పై ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్నాడు. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here