టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్‌ ఒకరు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన తమన్ చేతిలో ప్రస్తుతం ‘ఓజీ’, ‘గేమ్ ఛేంజర్’ వంటి పలు క్రేజీ సినిమాలు ఉన్నాయి. తాను పని చేసిన స్టార్స్ తో తమన్ మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తుంటాడు. ఆ లిస్టులో హీరోయిన్స్ కూడా ఉంటారు. తమన్ కి ఒక స్టార్ హీరోయిన్ ప్రతి ఏడాది గిఫ్ట్ పంపుతుందట. ఈ విషయాన్ని స్వయంగా తమన్ రివీల్ చేయడం విశేషం.

ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షోకి తమన్ జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. తాజా ఎపిసోడ్ లో హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తావన రాగా.. తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “అనుష్క గోల్డ్. స్వీట్ పర్సన్. నేను చూసిన బెస్ట్ పర్సన్స్ లో ఒకరు. ఆమె మనసు చాలా మంచిది. నాకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో ఆమె నుంచి ఐఫోన్ గిఫ్ట్ గా వస్తుంది. ‘భాగమతి’ చేసే టైంలో నాకు గాడ్జెట్స్ అంటే ఇష్టమని తెలిసి.. సినిమా హిట్ అయితే గిఫ్ట్స్ ఇస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే ప్రతి సంవత్సవరం ఐఫోన్ కొత్త వెర్షన్ రిలీజ్ అవ్వగానే నాకు గిఫ్ట్ పంపిస్తారు. ప్రస్తుతం నా చేతిలో ఉన్న ఫోన్ ఆమె పంపించిందే.” అని తమన్ అన్నాడు. 

అనుష్క గురించి చెబుతున్న సమయంలో తమన్ సిగ్గుపడిపోతుండటంతో.. జడ్జిలు గీతామాధురి, కార్తీక్, హోస్ట్ శ్రీరామ చంద్ర తమన్ కి సరదాగా ఆటపట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here