పవన్‌ కళ్యాణ్(pawan kalyan)మాజీ వైఫ్ రేణు దేశాయ్(renu desai)ఇటీవల కాలంలో సోషల్ యాక్టివిటీస్ లో చురుకుగా పాల్గొనడటమే కాకుండా తనకు తోచినంత సాయం చేయడంతో పాటు ప్రజలను విరాళాలు కోరుతూ శ్రమిస్తోంది. ఇటీవల సంభవించిన వరదల్లో చిక్కుకున్న యానిమల్స్ ని కాపాడాలని స్వయంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలని కూడా కోరిన రేణు రీసెంట్ గా వినాయక చవితి(vinayka chavithi)పండుగ జరుగుతున్న తీరు గురించి ఒక పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ న్యూస్  వైరల్ గా మారింది.

సినిమా హీరో, హీరోయిన్ల గెటప్స్‌లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా మండపాల్లో ఐటెం సాంగ్స్ ప్లే చేస్తున్నారు.పెద్ద పెద్ద విగ్రహాలు, భారీ డెకరేషన్స్ తో మిగతా వాళ్ళ కంటే  గొప్ప అనిపించుకోవాలన్నట్టుగా పండుగ చేస్తున్నారు. నిజానికి అందులో దేవుడు లేడు, మనిషి దురాశ, అత్యాశ మాత్రమే కనిపిసితున్నాయంటూ పోస్ట్ చేసింది.

హిందూ మతాన్ని అనుసరించే రేణు భారతదేశంలో సెక్యులరిజం, ప్రస్తుత పరిణామాలపై తన అభిప్రాయాల గురించి కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చర్చి,మసీదులు ప్రభుత్వ ఆధీనంలో ఉండవని, కేవలం హిందూ ఆలయాలు మాత్రమే ప్రభుత్వ అధీనంలో  ఉంటాయని, అలాంటప్పుడు ఇండియా సెక్యులర్ దేశం ఎలా అవుతుందని ప్రశ్నించింది. ఇక సెప్టెంబర్ ఏడున ప్రారంభం అయిన వినాయక చవితి పండుగని అన్నివర్గాల ప్రజలు ఆనందోత్సవాల మధ్య అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. కొన్ని ఏరియాల్లో అయితే గణనాధుడు  ఇప్పటికే  గంగమ్మ తల్లి ఒడికి చేరుకోగా చివరి రోజైన పదకొండవ రోజున పూర్తిగా  గంగమ్మ ఒడిలో సేదతీరనున్నాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here